ఐపీఎల్ 2020వ సీజన్ కు సంబంధించిన మినీ వేలం చెన్నైలో జరుగుతోంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు ఈ వేలంలో ఉన్నారు. ఈ వేలంలో కొంతమంది విదేశీ క్రికెటర్లు, భారత్ స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే ఈ వేలంలో టీ20 ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్‌కు ఊహించని షాక్ తగిలింది రూ.1.5 కోట్లకే పంజాబ్ కింగ్స్ సునాయాసంగా దక్కించుకుంది.
వాస్తవానికి ఈ వేలంలో 125 మంది విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా అందరి కళ్లు మాత్రం డేవిడ్ మలాన్‌పైనే ఉండేవి. ప్రస్తుతం మలాన్ టీ20 ప్రపంచ నెంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. గత కొద్దికాలంగా టీ20 మ్యాచ్‌ల్లో రికార్డు లెవల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2017లో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన మలాన్ 19 టీ20 మ్యచ్‌లాడి 855 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే బిగ్‌బాష్ లీగ్‌తో పాటు మిగతా లీగ్‌ల్లోనూ మలాన్ తన జోరును కొనసాగించాడు. దీంతో మలాన్‌ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తుండడంతో ఈసారి ఐపీఎల్లో మంచి ధర పలికే అవకాశం ఉందని అందరూ భావించారు కానీ అనూహ్యరీతిలో కేవలం రూ.1.5 కోట్లకే అతన్ని పంజాబ్ జట్టు దక్కించుకోవడం గమనార్హం.