Home క్రీడలు ఐపీఎల్ 2021 వేలం: రూ.16.25 కోట్లతో సంచలనం సృష్టించిన మోరిస్

ఐపీఎల్ 2021 వేలం: రూ.16.25 కోట్లతో సంచలనం సృష్టించిన మోరిస్

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 2020వ సీజన్ కోసం మినీ వేలం చెన్నైలో ప్రారంభ‌మైంది. మొత్తం 292 మంది ప్లేయ‌ర్స్ ఈ వేలంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఈ వేలంలో ప‌లువురు విదేశీ, ఇండియ‌న్ స్టార్ ప్లేయ‌ర్స్ కూడా ఉన్నారు. 8 ఫ్రాంచైజీలు త‌మ‌కు అందుబాటులో ఉన్న మొత్తం, కావాల్సిన ఆటగాళ్లను బ‌ట్టి వేలంలో బిడ్లు దాఖ‌లు చేస్తున్నారు. 

అయితే ఈ వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలో సంచ‌ల‌నం సృష్టించాడు. అత‌డు ఏకంగా రూ.15.75 కోట్ల‌కు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జటు అత‌న్ని ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అత‌ని కోసం ముంబై, బెంగ‌ళూరు, పంజాబ్, రాజ‌స్థాన్ ఫ్రాంచైజీలు పోటీ ప‌డి బిడ్లు దాఖ‌లు చేశాయి. కేవ‌లం రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలల్లోకి వచ్చిన మోరిస్‌.. చివ‌రికి రికార్డు ధ‌ర ప‌ల‌క‌డం విశేషం. ఈ వేలంలో మొదట బెంగళూరు ధర పెంచుతూ పోయింది.  రూ.5కోట్లు దాటగానే ముంబయి రంగంలోకి దిగింది. రూ.12 కోట్లు దాటగానే రాజస్థాన్‌ రాయల్స్‌ వచ్చింది. ఈ క్రమంలో పంజాబ్‌, రాయల్స్‌ రూ.16 కోట్ల వరకు  పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్‌ అతడిని రాయల్స్‌కే విడిచిపెట్టక తప్పలేదు.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు