ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా విజయం సాధించింది. ఈ రోజు జరిగిన ఫైనల్ లో అమెరికా కి చెందిన జెన్నిఫర్ బ్రాడి ని 6-4, 6-3 తేడాతో ఓడించింది. ఫైనల్ లో ఫేవరెట్ గా దిగిన ఒసాకా మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస సెట్లలో ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గెలిచింది. ఒసాకా కు కెరీర్ లో ఇది నాలుగవ గ్రాండ్ స్లాం కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత గా నిలవడం ఇది రెండవసారి.