విజయ్ హజారే టోర్నీ లో భాగం గా, తొలి రోజు ఝార్ఖండ్ మధ్య ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఝార్ఖండ్ ఏకం గా 324 పరుగుల తేడా తో విజయం సాధించింది. మొదట బాటింగ్ చేసిన ఝార్ఖండ్ ఇషాన్ కిషన్ విధ్వంసం తో తొమ్మిది వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. విజయ్ హజారే టోర్నీ లో ఇదే అత్యధిక స్కోర్.
ఇషాన్ 94 బంతుల్లో 173 పరుగులు చేశాడు. ఇందులో 19 బౌండరీలు, 11 సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ ఇచ్చిన ఊపుతో మిగతా బ్యాట్స్ మెన్ విరాట్ సింగ్, సుమిత్ కుమార్, అనుకూల రాయ్ కూడా బ్యాట్ ఝుళిపించారు. అనంతరం బాటింగ్ ప్రారంభించిన మధ్య ప్రదేశ్ 18.4 ఓవర్ల లో 98 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. పేసర్ వరుణ్ ఆరోన్ విజృంభించి ఆరు వికెట్లు తీశాడు.
ఐపీల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్, ఐదో సారి ఐపీల్ గెలవటం లో ప్రధాన పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే.
మరో నెల లేదా రెండు నెలల్లో కొత్త సీజన్ ప్రారంభమవుతున్న సందర్భం లో ఇషాన్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు తన ఇన్నింగ్స్ ద్వారా.