ఈ రోజు మెల్బోర్న్ పార్క్ లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ లో జకోవిచ్ 7-5, 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో మెద్వేదెవ్ పై విజయం సాధించాడు. తాను వరల్డ్ నెంబర్ వన్ అని మరోసారి నిరూపించాడు. మొదటి గ్రాండ్ స్లాం గెలవాలన్న కల మెద్వేదెవ్ కు కలగానే మిగిలిపోయింది. జకోవిచ్ అనుభవం ముందు మెద్వేదెవ్ అనుభవ లేమి స్పష్టం గా కనిపించింది. మొదటి సెట్ లో కొంత ప్రతిఘటించిన, జకోవిచ్ అనుభవం ముందు తలవంచక తప్పలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం జకోవిచ్ కు ఇది తొమ్మిదవ సారి. మొత్తం గా జకోవిచ్ కు ఇది 18 వ గ్రాండ్ స్లాం టైటిల్.