Home క్రీడలు తొలి టీ20: కాన్వే 99 నాటౌట్ ..న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా

తొలి టీ20: కాన్వే 99 నాటౌట్ ..న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ జట్టు ఘన విజయం సాధించింది.  అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్..సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 17.3 ఓవర్లలో  131 పరుగులకే ఆలౌటై దారుణ ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ జట్టులో మిచెల్‌ మార్ష్‌(45; 33 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌లు) మినహా ఎవరూ రాణించలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్‌ సోథీ నాలుగు వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరవగా, టిమ్‌ సౌతీ, ట్రెంట్‌ బౌల్ట్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకుముందు టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, న్యూజిలాండ్ ఓపెనర్లు గప్టిల్‌(0), సీఫెర్ట్‌(1)లు ఇద్దరూ విఫలమయ్యారు. అనంతరం కెప్టెన్‌  విలియమ్సన్‌(12) కూడా రాణించలేదు. కానీ  కాన్వే దుమ్మురేపాడు.  59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో​ 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో మిస్సయ్యాడు.

అత్యంత ప్రముఖమైనవి

బట్టల రామస్వామి బయోపిక్ టీజర్

అంతా కొత్త వారితో వస్తున్న చిత్రం “బట్టల రామస్వామి బయోపిక్”.  అల్తాఫ్ హాసన్, శాంతి రావు ప్రధాన పాత్రధారులు.  సతీష్ కుమార్, రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్...

టైం మ్యాగజైన్ – మహిళా దినోత్సవం ప్రత్యేక సంచిక

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ప్రముఖ మ్యాగజైన్ “టైం”ప్రత్యేక సంచిక విడుదల చేసింది.  దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న మహిళా రైతుల ఫోటో తో కవర్ పేజిని...

సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ మూవీ రివ్యూ:

నటీనటులు : సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, రావు రమేశ్‌, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు ...

టీ విరామ సమయానికి భారత్ 153/6

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు...

ఇటీవలి వ్యాఖ్యలు