సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఆ జట్టు సారథి, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్- 2021 సీజన్ లో ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. ఆసీస్, టీమిండియా సిరీస్ మధ్యలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గజ్జల్లో గాయం అవడంతో మూడో వన్డేతో పాటు టీ 20 సిరీస్‌కు దూరమయ్యాడు.
అయితే గజ్జల్లో గాయం నుంచి కోలుకోవడానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని వార్నర్ సోమవారం తెలిపిన సంగతి తెలిసిదే. దీంతో రెండు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021వ సీజన్‌కు అతడు అందుబాటులో ఉండడని అందరూ భావించారు. అయితే తాజాగా తన గాయం తీవ్రతపై వార్నర్ స్పష్టత ఇచ్చాడు.
ఈ క్రమంలో వార్నర్ మాట్లాడుతూ..”గాయం తీవ్రత మరో కొన్ని నెలలు ఉంటుందని, అప్పటివరకు మైదానాన్ని వీడాల్సిన అవసరం లేదని తెలిపాడు. మర్చిలోనే మైదానంలోకి దిగుతున్నట్లు ట్వీట్ చేశాడు. ‘‘సోమవారం రాత్రి నేను చేసిన కామెంట్స్ కు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం మరో 6 నుంచి 9 నెలల సమయం పడుతుంది. కానీ మార్చి 4 నుంచే న్యూసౌత్‌వేల్స్ జట్టు తరఫున తిరిగి బరిలోకి దిగుతున్నా’’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో వార్నర్ ఐపీఎల్ 2021 సీజన్ లో బరిలోకి దిగుతాడాని స్పష్టంగా తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 142 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్.. 5,254 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో వార్నర్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ సాదించిన విషయం తెలిసిందే.