Home టీవీ జీ తెలుగు లో మూడు పెళ్లిళ్లు ...!

జీ తెలుగు లో మూడు పెళ్లిళ్లు …!

లాక్ డౌన్ తరవాత ఈ మధ్యనే అన్ని చానెల్స్ వారు ఒరిజినల్ కార్యక్రమాలను ప్రసారం చేయడం మొదలు పెట్టారు.  ప్రేక్షకులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయం గా ముందుకు సాగుతున్నారు.  స్టార్ మా ఎప్పటికప్పుడు సరి కొత్త సినిమాలను, కార్యక్రమా లను ప్రసారం చేస్తూ ఉంటుంది. ఆపై వంటలక్క ఎలాగు ఉంది.  ఈటీవీ వారు మాత్రం ప్రధానం గా వినోద భరిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు.  జెమినీ గురించి చెప్పనవసరం లేదు…జెమినీ అంటే సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి.

అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెళ్ల లో జీ తెలుగు ఒకటి.  జీ తెలుగు ధారావాహికలు అత్యంత ప్రజాదరణను చూరగొన్నాయనటం లో సందేహం లేదు.  జీ తెలుగు అనగానే గుర్తుకు వచ్చేవి మాత్రం సీరియల్స్ అని ఖచ్చితం గా చెప్పవచ్చు ఎందుకంటే ముద్ద మందారం సీరియల్ ప్రభావం అలాంటిది. 

లాక్ డౌన్ కు ముందు ప్రారంభించిన జీ తెలుగు కొత్త సీరియల్స్ అన్నీ ఒక్కొక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు వీటి ప్రచార కర్త గా కొన్నాళ్లపాటు పని చేశారు.  ఇప్పుడు కొత్త సీరియల్స్ అన్నిటిలో పెళ్ళిళ్ళు చేయడానికి సిద్దమయ్యారు జీ తెలుగు కార్యక్రమ నిర్వాహకులు. 

ఎనిమిది గంటలకు ప్రసారమయ్యే  నెం.1 కోడలు లో సరసు రాహుల్ ల పెళ్లి సందడి తో ప్రారంభమయి ఎనిమిదిన్నర కి ప్రారంభమయ్యే నాయని విశాల కల్యాణ వైభోగం తో తొమ్మిది గంటలకు అను ఆర్య ప్రేమ ల ఎంత మధురమో ఆ మధురమైన ప్రేమ కి పెళ్లి కళ వస్తుందో లేదో తెలియాలంటే జీ తెలుగు లో ప్రసారమయ్యే సీరియల్స్ ను ఎనిమిదింటి నుంచి తొమ్మిదిన్నర వరకు అంటే గంటన్నార పాటు చూడాల్సిందే.

అల్ ది బెస్ట్ జీ తెలుగు

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు