చరిత్ర మరచిపోని వీర నారి గాధను బుల్లి తెరపైకి తీసుకు వస్తున్న స్టార్ మా. ఈ నెల 18 నుండి రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది
ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఓరుగల్లు (నేటి వరంగల్లు) రాజధానిగా పరిపాలించారు. క్రీ.శ.1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. మనదేశంలో మహిళాపాలకులు చాలా అరుదు. రాణీ రుద్రమదేవికి కొద్దికాలంముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు.ప్రభువర్గాలకు చెందిన వారు స్త్రీపరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుదముట్టించారు.
ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి, ఆమె పరిపాలన, ధైర్యసాహసాలను కొనియాడాడు
రుద్రమ దేవి టైటిల్ క్రింద, సాటిలేని మహారాజు అని రాశారు. గుణ శేఖర్, అనుష్క ప్రధాన పాత్రధారిగా తీసిన రుద్రమ దేవి చూసిన వాళ్ళకి ఇలా ఎందుకు వ్రాశారో తెలుస్తుంది. కొత్తదనం కోసం పాకులాడే స్టార్ మా ఈ రుద్రమ దేవి కథని ఎలా చెప్పబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానం
రుద్రమ దేవి. తెలుగు జాతి గర్వ కారణం….తర తరాల నిండు గౌరవం..! అల్ ది బెస్ట్ స్టార్ మా.