తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తోన్న కార్మికులు ఇల్లు, రేషన్ కార్డులు, ఇన్సూరెన్సు కావాలని కోరుతూ ఫిబ్రవరి 14 న టెలివిజన్ షూటింగ్ లకు సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తెలిపింది.
ఈ సందర్భం గా సంస్థ స్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ “నేడు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తెలుగు టెలివిజన్ పరిశ్రమలో సుమారు లక్షా నలభై ఎనిమిది వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీళ్లందరూ సర్వీస్ టాక్స్, జి ఎస్ టి మరియు టి డి ఎస్ రూపేణా సుమారు 1800 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. దీనిలో ఒక్క శాతం కూడా పరిశ్రమ సంక్షేమానికి ఖర్చు పెట్టడం లేదని వారి ఆరోపణ.
తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్లను ఒక వేదిక ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని ఫిబ్రవరి 14 న టెలివిజన్ షూటింగ్ లకు సెలవు ప్రకటించారు. దీనికి నిర్మాతల మండలి సహకారం కూడా లభించిందని ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ఒక నిర్ధిష్టమైన కార్యాచరణ ని ప్రకటిస్తారని ఆశిద్దాం.