గతేడాది ప్రసారమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 టైటిల్‌ని అభిజీత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్‌కార్డ్ సహా) ఈ సీజన్లో పాల్గొనగా.. అందరూ ఊహించినట్లుగానే అభిజీత్ టైటిల్‌ని గెలుచుకోగా అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే, తాజాగా అఖిల్ సార్ధక్ తన కన్న కలను నెరవేర్చుకున్నాడు. 25 ఏళ్లలోపు కారు కొనుక్కుంటానని ప్రామిస్ చేసిన అతను అది నిజం చేశాడు. ఇది అంత తన కష్టం, హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైందంటూ చెప్పుకొచ్చాడు. అమ్మనాన్న ప్రేమ లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదని చెప్పుకొచ్చాడు. అఖిల్ కారు కొన్న సందర్భంగా మోనాల్, సోహెల్‌తో పాటు పలువురు ప్రముఖులు, నెటిజన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్ తో కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్గా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోనాల్ పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఈ వెబ్ సిరీస్‌లో అఖిల్ నటిస్తున్నాడని చెప్పేసరికి.. వెంటనే ఓకే చెప్పానని మోనాల్ గజ్జర్ వెల్లడించింది. బిగ్ బాస్‌లో మా ఇద్దరి పెయిర్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే మమ్మల్ని స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నారని మోనాల్ స్పష్టం చేసింది. కాగా, గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు జాబ్ కోసం వచ్చిన అమ్మాయికి.. విలేజ్ నుంచి సిటీకి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయికి మధ్య నడిచే లవ్ స్టోరీనే ఈ వెబ్ సిరీస్ కథాంశం.