Home Uncategorized ఎంతో మందికి జీవితాన్నిచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే

ఎంతో మందికి జీవితాన్నిచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే

తెలుగు టెలివిజన్  చరిత్రలో ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్ధస్త్ ఒక నూతన అధ్యాయం

2007 ఫిబ్రవరి లో మొదలై, గత ఏడు సంవత్సరాలు పైగా  వీక్షకులను  కడుపుబ్బా నవ్విస్తూ అద్భుతమైన TRP రేటింగ్స్ సాధిస్తూ దూసుకు పోతోంది జబర్దస్త్.   ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగా ఖతర్నాక్ కామెడీ షో అనిపించుకుంది.  మల్లెమాల వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా ఈ షో ని రూపొందిస్తున్నారు.

నాగబాబు సినిమా నటుడిగా, నిర్మాతగా కన్నా ఈ షో  న్యాయ నిర్ణేతగా ఎంతో ఖ్యాతి ని సంపాదించారు.  నాగబాబు నవ్వుకు చాలామంది అభిమానులు వున్నారు.  స్మైలీ రోజా  గారు ప్రధాన ఆకర్షణ. 

మొదటి వారానికి ఒక రోజు గురువారం వచ్చేది.  తరవాత 2014 లో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో శుక్రవారం కూడా మొదలైంది

మొదట్లో సినిమా నటులను తీసుకు వచ్చిన ఆ తర్వాత కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.  సుడిగాలి సుధీర్, హైపర్ ఆది పాపులారిటీ అంతా ఇంతా కాదు.  వీళ్ళ పేర్లు తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో ఉండరేమో…!

సుడిగాలి సుధీర్ అండ్ రష్మి కెమిస్ట్రీ ఒక సెన్సేషన్.  చిన్న పిల్లల చేత కూడా స్కిట్స్ అద్బుదంగా చేయిస్తున్నారు.

ఒక షోకి పని చేసిన అందరికి పేరు రావటం చెప్పుకోదగిన అంశం.  వ్యాఖ్యాతలు రేష్మి, అనసూయ లు Celebrity హోదా సాధించారు ఈ ఒక్క షో తో.  ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. 

యూట్యూబ్ లో ఈ షో కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  వ్యూస్ మిలియన్స్ లో ఉంటాయి.  సామాన్యులను టెలివిజన్  స్థాయికి మరియు టెలివిజన్  స్థాయి నుంచి సినిమా స్థాయికి తీసుకు వెళ్ళింది

కొన్ని విమర్శలు ఉన్నా  ముఖ్యంగా ఈ స్కిట్స్ రాస్తున్న రాతగాళ్ళు నిజంగా  ధన్య జీవులు….మనల్ని నవ్విస్తున్నందుకు.

ఎందుకంటే, ప్రముఖ రచయిత మరియు దర్శకుడు శ్రీ జంధ్యాల గారు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు.  అది కరోనా కష్టకాలంలో.!

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు