హైదరాబాద్ కి చెందిన, టీం ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు తండ్రయ్యాడు. ఆదివారం ఆడబిడ్డకు ఆయన భార్య జన్మనిచ్చింది. ఈ విషయం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట గా తెలియచేసింది. మన అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడే. రాయుడు అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరమైనప్పటికీ, ఐపీల్ కు ఇంకా గుడ్ బై చెప్పలేదు. చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడు మరియు సహచర ఆటగాడైన సురేష్ రైనా, రాయుడికి అభినందనలు తెలిపాడు.
హైదరాబాదీ ల తరపున, తెలంగాణ రాష్ట్రం తరపున, యావత్ భారత దేశం తరపున మన అభినందనలు తెలియ చేద్ద్దాం