Home Uncategorized కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా అశోక్‌ గెహ్లాట్‌!

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా అశోక్‌ గెహ్లాట్‌!

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్‌ గాంధీ ఒప్పుకోకుంటే..ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను నియమించనున్నట్లు సమాచారం. అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు రాహుల్ ఇప్పటి వరకు అంగీకరించలేదు. దింతో గాంధీ కుటుంబానికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్న అశోక్‌ గెహ్లాట్‌ను ఆ స్థానంలో నియమించాలని కాంగ్రెస్ అధినాయకత్వం యోచిస్తోంది..కాగా, సోనియా గాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం వర్చువల్‌ విధానంలో జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎంపికతో పాటు, సంస్థాగత ఎన్నికలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవిచూడడంతో..రాహుల్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో తాత్కాలిక బాధ్యతలను సోనియాగాంధీకి అప్పగించారు.అయితే పలువురు మద్దతుదారులు రాజీనామా వెనక్కి తీసుకొని.. బాధ్యతలు స్వీకరించాలని రాహుల్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినా.. ఆయన ఇందుకు అంగీకరించలేదు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పలువురు సీనియర్‌ నేతలు పార్టీని ప్రక్షాళన చేయాలని, కొత్త అధ్యక్షుడిని నియమించాలని,  కోరుతూ సెప్టెంబర్‌లో 23 మంది సీనియర్ నాయకులు పార్టీ నాయకత్వానికి లేఖ రాసిన  విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు