టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్రీకారం’.కిశోర్ బి. దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చుతున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించగా జే యువరాజ్ సినిమాటో గ్రఫి అందించారు. ఈ సినిమాలో రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు..
కాగా,మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ‘శ్రీకారం’ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు…ఈ పోస్టర్లో గళ్ల లుంగీ, కాటన్ షర్ట్, భుజాన కండువాతో నవ్వుతూ నిల్చొని వున్న శర్వానంద్ మంచి లుక్ లో కనిపిస్తున్నారు.కాగా,అంతకుముందు ‘శ్రీకారం’కు సంబంధించి విడుదల చేసిన ‘బలేగుంది బాలా’, ‘సందళ్లె సందళ్లే సంక్రాంతి సందళ్లే’ వంటి పాటలు ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని ఏర్పరిచాయి…Attachments area