Home Uncategorized నాగ్‌ అశ్విన్‌ 'జాతి రత్నాలు' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నాగ్‌ అశ్విన్‌ ‘జాతి రత్నాలు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్ యువకథానాయకులు నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘జాతిరత్నాలు’. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మారి  స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై ‘జాతి రత్నాలు’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.వైజయంతీ మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.తాజాగాసినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్రబృందం ఒక మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ‘జాతిరత్నాలు’ థియేటర్లలోకి రానున్నారు. ‘‘ఇంట్లో కాదు థియేటర్స్‌లో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం’’ అంటూ వినూత్నంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంతేకాదు, మోషన్ పోస్టర్ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది.ఈ సినిమాకు రథన్ సంగీతం సమకూర్చారు.సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి అభినవ్ రెడ్డి దండ ఎడిటర్.


కాగా,క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన నవీన్‌ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగానూ సక్సెస్‌ సాధించాడు. తరువాత బాలీవుడ్‌లో చిచోరే సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ కామెడీ సెన్సేషన్స్‌ స్టార్స్‌ ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలతో కలిసి జాతి రత్నాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇండియా లెజెండ్స్ క్రికెట్ – మార్చ్ 5 నుంచి

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా మార్చ్ 5 న ఈ సిరీస్ ప్రారంభమవుతోంది.  ఆయా దేశాల మాజీ క్రికెటర్ లు ఈ సిరీస్ లో ఆడనున్నారు. ...

మహిళల అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ – మార్చ్ 7 నుంచి

భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ తో ఆరంభమవుతోంది.  బి సీ సీ ఐ వన్ డే మరియు టి 20ల మహిళా జట్లను...

ఇటీవలి వ్యాఖ్యలు