మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయవుతున్న విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ వెండితెరపై మెరవబోతున్నారు. వైష్ణవ్ తేజ్ కు జోడిగా కృతి శెట్టి కథానాయికగా నటించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లలోకి రానుంది.
కాగా,గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2020 వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్, లాక్డౌన్ రావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని అంతా భావించారు. అయితే, చిత్ర యూనిట్ థియేటర్లలో విడుదల చేసేందుకు మొగ్గు చూపడంతో..ఇటీవల విడుదల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.ఈ టీజర్‌తో ‘ఉప్పెన’పై అంచనాలు భారీగా పెరిగాయి.కాగా,మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.