Home Uncategorized ట్రైలర్ టాక్: సస్పెన్స్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘అక్షర’

ట్రైలర్ టాక్: సస్పెన్స్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘అక్షర’

నందితా శ్వేత లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘అక్షర’. సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అయింది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.  సస్పెన్స్, యాక్షన్ సమపాళ్లలో చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. నందిత నటన ప్రధానంగా నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో విద్యను వ్యాపారం చేసిన కాలేజీల నిర్వాకాన్ని, సీట్లు, ర్యాంకుల అమ్మకాలను విమర్శిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడిని తెర మీద చూపించేందుకు అక్షర చిత్రయూనిట్‌ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అక్షర ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్‌ చేశాడు. ఒక పెద్ద కాలేజీలో చదివే ఓ విద్యార్థి మరణం చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. భూమిని నమ్ముకున్నోడు రైతు, చదువును నమ్ముకున్నోడు రాజు అని చెప్పిన డైలాగు అద్భుతంగా ఉంది. కాగా, చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నగేష్ బెనల్ సినిమాటోగ్రఫీ అందించారు. జి.సత్య ఎడిటర్. నరేష్ బాబు తిమ్మిరి ఆర్ట్ డైరెక్టర్. కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్ సహ నిర్మాతలు.

అత్యంత ప్రముఖమైనవి

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్...

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇండియా లెజెండ్స్ క్రికెట్ – మార్చ్ 5 నుంచి

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా మార్చ్ 5 న ఈ సిరీస్ ప్రారంభమవుతోంది.  ఆయా దేశాల మాజీ క్రికెటర్ లు ఈ సిరీస్ లో ఆడనున్నారు. ...

ఇటీవలి వ్యాఖ్యలు