Home Uncategorized నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌.. నిరాశకు గురైన ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌.. నిరాశకు గురైన ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా అప్‌డేట్‌ గురించి రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనవరి 29న లేదా ఫిబ్రవరి 26న స్పెషల్‌ అప్‌డేట్‌ ఉంటుందని భరోసా ఇచ్చిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తీరా సమయానికి చేతులెత్తేశాడు. ఫిబ్రవరి 26 నాడు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదని చెప్తూ ప్రభాస్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. రకరకాల మీమ్స్‌ కామెంట్లుగా పోస్ట్‌ చేశారు. కాగా, ప్రభాస్..‌ తాజాగా నటించిన ‘రాధేశ్యామ్’‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘సలార్‌’షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత  ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఆదిపురుష్‌ షూటింగ్‌లో పాల్గొంటారు.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో  ప్రభాస్‌ రాముడిగా, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు