Home Uncategorized ప్రేమ‌లో ప‌డ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. త్వ‌ర‌లోనే పెళ్లి..!

ప్రేమ‌లో ప‌డ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. త్వ‌ర‌లోనే పెళ్లి..!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ ఓ యువ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె 2017లో నటించిన ‘ఆక్సిజన్’‌ సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణతో డేటింగ్ లో ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారిందని అంటున్నారు. అలాగే వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కాగా, ఈ వార్తలపై అను ఇమ్మాన్యుయేల్‌ కానీ, జ్యోతి కృష్ణ కానీ ఇంతవరకు స్పందించనేలేదు.

అయితే, ఏఎం ర‌త్నం కుమారుడు అయిన జ్యోతికృష్ణ‌కు, అను ఎమ్మాన్యుయేల్‌కు ఆక్సీజ‌న్ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప్రేమ పుట్టింద‌ట‌. ‘యాక్షన్‌ హీరో బైజు’ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన అను ఎమ్మాన్యుయేల్ టాలీవుడ్ లో నాని స‌ర‌స‌న ‘మ‌జ్ను’ అనే చిత్రం చేసింది.  నాగ చైత‌న్య స‌ర‌స‌న  ‘శైలజా రెడ్డి అల్లుడు , బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన ‘అల్లుడు అదుర్స్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న అజ్ఞాత‌వాసి వంటి చిత్రాల‌లో  నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ శర్వానంద్‌, సిద్దార్థ్‌ కలిసి నటిస్తున్న ‘మహాసముద్రం’లో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు