టాలీవుడ్ కథానాయకుడు నితిన్.. బాక్సాఫీస్ వార్‌కు సిద్ధమయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా మూడు సినిమాలతో ఆయన ఈ ఏడాది వెండితెరపై సందడి చేయనున్నారు. గతేడాది విడుదలైన ‘భీష్మ’ తర్వాత మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లపై సంతకం చేసిన ఆయన.. శరవేగంగా వాటి చిత్రీకరణలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ యువ హీరో నటించిన ‘చెక్’ మూవీ ఫిబ్రవరి 26న విడుదల కానుండగా, ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నితిన్ నటించిన మరో చిత్రం ‘రంగ్ దే’. మార్చి 26న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మరోవైపు నితిన్ .. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ‘అంధాదున్’ సినిమాకి రేమక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. జూన్ 11న సినిమాను విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు.
అయితే తాజాగా నితిన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. గత రెండేళ్లుగా చర్చల్లో ఉన్న ‘పవర్ పేట’ సినిమాకు తాజాగా నితిన్ ఓకే చెప్పారంట. ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది మేలో పట్టాలెక్కించేందుకు చూస్తున్నరని తెలుస్తోంది. ఈ సినిమాలోని నటీనటులను, టెక్నీషియన్లను ఎంపిక చేస్తున్నారంట. అయితే ఈ సినిమాలో నితిన్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారని సమాచారం. 20 ఏళ్ళు, 40 ఏళ్లు, 60 ఏళ్ళు ఇలా మూడు పాత్రలలో వైవిధ్యమైన నటనతో అలరించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని, తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమ విడుదల కానుందని సమాచారం.