నందమూరి తారక రామారావు గారు భీష్మ అనే చిత్రంలో నటించి అందరినీ మెప్పించారు. హైలో హైలెస్సా హంసా కదా నా పడవ..పాట భీష్మ చిత్రంలోనిది. నందమూరి తారక రామారావు గారు వేసిన పౌరాణిక పాత్రలతో కెల్లా భీష్మ ఒక ప్రత్యేకతను సంతరించు కుంది. ఆయన వయసుకు మించిన పాత్ర పోషించి అశేష ప్రేక్షకాభిమానం పొందారు. ఎలాంటి పౌరాణిక పాత్ర అయినా స్ఫురించే ఏకైక పేరు “నందమూరి తారక రామారావు”
తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనయుడు బాలకృష్ణ. నందమూరి తారకరామారావు గారి తరవాత పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు బాలకృష్ణ. పేజీలకు పేజీలు డైలాగులు చెప్పడంలో కూడా బాలకృష్ణ కు ఎవరు సాటి రారు.
“ఎన్ టి ఆర్ కధానాయకుడు” చిత్రం కోసం బాలకృష్ణ భీష్ముడిగా కొన్ని సన్నివేశాలు తీశారు. అయితే చిత్ర నిడివి ఎక్కువగా ఉండడం వలన వాటిని తొలగించారు. మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భం గా, ఆ పాత్రకు సంబంధించిన , కొన్ని చిత్రాలను బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు